Thursday, December 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచంద్రకళగా ఎప్పటికీ గుర్తుంటా..

చంద్రకళగా ఎప్పటికీ గుర్తుంటా..

- Advertisement -

స్వప్న సినిమాస్‌ అప్‌ కమింగ్‌ మూవీ ‘ఛాంపియన్‌’. రోషన్‌, అనస్వర రాజన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ అనస్వర రాజన్‌ మీడియాతో ముచ్చటించారు. వైజయంతి మూవీస్‌, స్వప్న సినిమాస్‌ లాంటి గొప్ప సంస్థ చేస్తున్న సినిమాతో తెలుగుకి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఇలాంటి కథ ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉన్నాయి. ఇందులో చంద్రకళ పాత్ర ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఈ పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. రోషన్‌ వెరీ స్వీట్‌. తను డైలాగ్స్‌, డ్యాన్స్‌లో నాకు చాలా సపోర్ట్‌ చేశారు. లాంగ్వేజ్‌ అనేది బిగ్గెస్ట్‌ ఛాలెంజ్‌. ఒక భాష తెలిస్తే అందులో మనం ఇంప్రవైజ్‌ చేయగలం.

కానీ భాష తెలియకపోతే ఆ సౌకర్యం ఉండదు. కాకపోతే డైరెక్టర్‌ ప్రదీప్‌ సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌కి ఏం కావాలో అన్ని పర్‌ఫెక్ట్‌గా చేశాను. నిజానికి నాకు వింటేజ్‌ పీరియడ్‌ సినిమాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనం రియల్‌ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేయలేని ఎలిమెంట్స్‌ ఇందులో మనం అనుభూతి పొందవచ్చు. మిక్కీ జే మేయర్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. ఆయన ‘హ్యాపీడేస్‌’ సినిమా పాటలు అంటే ఎంతగానో ఇష్టం ఎప్పటినుంచో ఆయన సాంగ్స్‌ వింటూ ఉంటున్నాను. ఈ సినిమాకి ఆయన ఇచ్చిన మ్యూజిక్‌ మనసుని ఆకట్టుకునేలా ఉంటుంది. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌ని రామ్‌ చరణ్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. రామ్‌ చరణ్‌ ‘మగధీర’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాని ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు. తెలుగులో నాకు అల్లు అర్జున్‌ ఇష్టమైన స్టార్‌. తెలుగులో ‘ఇట్లు మీ అర్జున’ చేస్తున్నాను. ‘ఛాంపియన్‌’ కంటే ముందే సైన్‌ చేసిన సినిమా అది. కాకపోతే ‘ఛాంపియన్‌’ ముందుగా రిలీజ్‌ అవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -