- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
గ్రామ అభివృద్ధికి అన్నివేళలా సహకరిస్తానని ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. సోమవారం మండలంలోని అంతంపల్లి గ్రామ సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి షబ్బీర్ అలిని మర్యాదపూర్వకంగా కలిసి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై సెల్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నిర్మల విరోబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారెడ్డి, అమృత రెడ్డి, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



