Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

అభివృద్ధి చేసి చూపిస్తా.. ఆశీర్వదించండి

- Advertisement -

నాలుగో వార్డ్ సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ప్రజల సమస్యలను నా సమస్యలుగా భావించి నాలుగో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని సీపీఐ(ఎం) పార్టీ బలపరిచిన నాలుగో వార్డ్ అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ ప్రజలను కోరారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలేరు పట్టణంలోని నాలుగో వార్డులో ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డులో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని, ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్య సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికైన వెంటనే ఈ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.

సీపీఐ(ఎం) పార్టీ ఎల్లప్పుడూ పేదలు, కార్మికులు, మహిళలు, యువత సమస్యల పరిష్కారం కోసం పోరాడిందని గుర్తుచేశారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను ప్రశ్నిస్తూ,ప్రజల పక్షాన నిలబడే నిజాయితీగల పాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నాలుగో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఐ (ఎం) జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్, ఘణగాని మల్లేష్, మోరిగాడి ఆంజనేయులు, మొరిగాడి రమేష్, మొరిగాడి మహేష్, ఆకుల సత్యనారాయణ, పోతుగంటి సంపత్ కుమార్, మొరిగాడి మహావీర్, మొరిగాడి రాజు, అనిత సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -