రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న దీనికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీడియాతో ముచ్చటించింది. ‘కాంత’ సినిమాలోని నా పర్ఫార్మెన్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు నటిగా నాలో ఉన్న పొటెన్షియల్ చూశారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది ఆరంభం మాత్రమే. ఇందులో నేను మహాలక్ష్మి క్యారెక్టర్‌లో కనిపిస్తాను. తను కాలేజ్ గోయింగ్ గర్ల్. హీరో సాగర్‌తో ప్రేమలో ఉంటుంది. కథలో నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ క్యారెక్టర్ ఆడియన్స్ గుర్తుపెట్టుకునేలా ఉంటుంది.
అభిమానం అనేది డివైన్ ఎమోషన్.
నేను నార్త్ నుంచి సౌత్‌కి వచ్చినప్పుడు ఇక్కడ అభిమానుల అభిమానం చూసిన తర్వాత ఒక స్టార్‌ని ఎంత గొప్పగా ఆరాధిస్తారో, ప్రేమిస్తారో ప్రత్యక్షంగా చూశాను. అది నిజంగా చాలా గొప్ప ఎమోషన్. ఎలాంటి రిలేషన్ లేకుండా, పరిచయం లేకుండా ఒక వ్యక్తిని అంతలా ఎలా అభిమానిస్తారు అనిపించేది. దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఉపేంద్రతో ఒక కాంబినేషన్ సీన్ ఉంది. ఇందులో ప్రేమ కథ చాలా స్వచ్ఛంగా ఉండబోతుంది. ‘నువ్వుంటే చాలు, చిన్ని గుండెలో’ పాటలు.. ప్రేమలో ఉన్న గొప్ప ఎమోషన్‌ని చూపించాయి. రామ్‌తో నటించడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. మైత్రి మూవీ మేకర్స్ రవి, నవీన్‌తో కలిసి చేయటం చాలా హ్యాపీ అనిపించింది. చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తీశారు. నాకోసం ఎలాంటి కథలు రాసిపెట్టి ఉన్నాయో నాకు తెలియదు. అయితే వచ్చిన ప్రతి క్యారెక్టర్‌కి 100% ఇచ్చి ఒక వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. అనుష్క ‘అరుంధతి’లో చేసినటువంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అలాంటి పాత్రలు నాకు వస్తాయని ఆశిస్తున్నాను.
మహాలక్ష్మిగా అలరిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



