Tuesday, July 8, 2025
E-PAPER
Homeసినిమాసత్యభామగా అలరిస్తా..

సత్యభామగా అలరిస్తా..

- Advertisement -

హీరో సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళం సినిమా ‘జో’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మనోజ్‌ ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్‌ గోధల దర్శకుడు. వీఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల నిర్మిస్తున్నారు. ఈనెల11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ సోమవారం మీడియాతో ముచ్చటించారు. నేను తమిళంలో నటించిన త్రం ‘జో’లో నా అభినయం చూసి దర్శకుడు రామ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నారు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్‌ సింపుల్‌ గర్ల్‌గా చేశాను. ఈ సినిమలో నా పాత్ర ఎంతో మోడ్రరన్‌గా, హైపర్‌ యాటిట్యూడ్‌తో ఉంటుంది.
ప్రతి నటికి కావలసిన వైవిధ్యమైన పాత్ర నాకు లభించింది. ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను. నా రియల్‌లైఫ్‌కు ఎలాంటి కంపారిజిన్‌ లేని పాత్ర ఇది. నేను చేసిన ఈ పాత్ర ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది.
నాకు తెలుగు రాకపోయినా.. దాని భావం అర్థం చేసుకుని నటించాను. తెలుగులో నటించడం చాలా హ్యపీగా అనిపించింది. సుహాస్‌తో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. జనరల్‌గా అని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలే అయినా ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాల్లో ఫీల్‌ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజారు చేస్తారు. ఎంటర్‌టైన్‌ అవుతారు.
నాకు ఎప్పుడూ డిఫరెంట్‌గా, ఛాలెంజింగ్‌ పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటిన్‌ పాత్రలు చేస్తే నాకే కాదు, ఆడియన్స్‌కి కూడా బోర్‌ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -