పారిస్ : ఇజ్రాయిత్‌తో నేరుగా చర్చలు జరిపేందుకు లెబనాన్ సిద్ధంగా ఉన్నదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ చెప్పారు. ఇజ్రాయిల్, లెబనాన్ చర్చలకు పారిస్‌లో తాను ఆతిథ్యమిస్తానని ఆయన తెలిపారు. ఈ చర్చలలో సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రతినిధ్యం కల్పించాలని సూచించారు. లెబనాన్ అధ్యక్షుడితోనూ, ప్రధానితోనూ తాను మాట్లాడానని అన్నారు. ‘హెజ్బొల్లా తన నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. ఇజ్రాయిల్ కూడా భారీ వైమానిక దాడులను నిలిపివేయాలి’ అని సూచించారు.
యూఏఈ నగరాలపై దాడులు చేస్తాం : ఇరాన్
తమ దేశానికి చెందిన అబూ ముసా, ఖర్గ్ దీవులపై దాడులు చేసేందుకు అమెరికా దళాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని నగరాలను వాడుకుంటోందని ఇరాన్ ఆరోపించింది. ఇందుకు ప్రతిగా ఆయా నగరాలపై దాడులు చేస్తానని హెచ్చరించింది. ఎమిరేట్స్‌లోని ఓడరేవులు, వాటిలోని డాక్స్, రహస్య ప్రదేశాల నుంచి అమరికా దళాలు దాడులు చేస్తున్నాయంటూ ఇరాన్‌కు చెందిన ఖతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది.
లెబనాన్-ఇజ్రాయిల్ చర్చలకు ఆతిథ్యమిస్తా : మాక్రాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



