నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. సినిమా రిలీజ్‌కి సిద్ధమైన నేపథ్యంలో కథనాయిక మీనాక్షి చౌదరి మీడియాతో ముచ్చటించారు.
-‘గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు’ ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు ఈసినిమాతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.
-ఇందులో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్‌గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇలా పూర్తిస్థాయి కామెడీ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.
-ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్‌పుట్స్‌ని బట్టి, నాకున్న అవగాహనతో ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్‌గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్‌గా ఉంటుంది.
చారులతగా నవ్విస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


