Friday, April 3, 2026
E-PAPER
Homeఆటలుటాప్‌ ఆర్డర్‌లోనే ఆడతా!

టాప్‌ ఆర్డర్‌లోనే ఆడతా!

- Advertisement -

లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ పంత్‌

లక్నో : ఐపీఎల్‌ 19వ సీజన్‌లో ఓపెనర్‌గా ఆడే అవకాశాలు సగం సగమే ఉన్నాయని లక్నో సూపర్‌జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో మిచెల్‌ మార్ష్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చిన రిషబ్‌ పంత్‌.. సీజన్‌లో ఓపెనర్‌గా కొనసాగటంపై స్పష్టత ఇవ్వలేదు. ‘ ఓపెనర్‌గా వచ్చే అవకాశాలు సగం సగమే. కానీ కచ్చితంగా మీరు నన్ను టాప్‌ ఆర్డర్‌లోనే చూస్తారు’ అని రిషబ్‌ పంత్‌ తెలిపాడు. గత సీజన్‌లో మిచెల్‌ మార్ష్‌ అందుబాటులో లేకపోవటంతో రిషబ్‌ పంత్‌ ఓపెనర్‌ అవతారమెత్తాడు. 2022 నవంబర్‌ తర్వాత టీ20ల్లో పంత్‌ ఓపెనర్‌గా రాలేదు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 9 బంతుల్లో 7 పరుగులే చేసిన పంత్‌ రనౌట్‌గా నిష్క్రమించాడు. పంత్‌ ఓపెనర్‌గా రావటంతో ఎడెన్‌ మార్‌క్రామ్‌ నం.3 పొజిషన్‌కు వెళ్లాడు. మిచెల్‌ మార్ష్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ జోడీ గత సీజన్‌లో ఓపెనర్లుగా రాణించారు. మార్‌క్రామ్‌ 148.82 స్ట్రయిక్‌రేట్‌తో 442 పరుగులు చేశాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లోనూ ఓపెనర్‌గా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ ప్రస్థానంలో మార్‌క్రామ్‌ కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -