– కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత
నవతెలంగాణ – పెద్దవంగర
పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పోచంపల్లి గ్రామానికి చెందిన పిండి యాకయ్య ఇటీవల మృతి చెందారు. సభ్యత్వ నమోదులో భాగంగా చేసిన బీమా పథకంలో రూ. 2 లక్షల చెక్కును ఆయన కుటుంబానికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తకు అధిష్టానం అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్తలను ఆదుకోవడం కోసం దేశంలోనే మొదటిసారిగా భీమా కల్పించారని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, సుధగాని మనోహర్, రసాల సమ్మయ్య, యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటా: ఎర్రబెల్లి
- Advertisement -
RELATED ARTICLES