Sunday, January 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనైలునదీ జలాల వివాదాన్ని పరిష్కరిస్తా

నైలునదీ జలాల వివాదాన్ని పరిష్కరిస్తా

- Advertisement -

ఈజిప్ట్‌, ఇథియోపియా మధ్య మధ్యవర్తిత్వం వహిస్తా : ట్రంప్‌

వాషింగ్టన్‌ : దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న నైలు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించడానికి ఈజిప్ట్‌, ఇథియోపియా మధ్య తిరిగి మధ్యవర్తిత్వం నెరిపేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆ మేరకు ఆయన శుక్రవారం తన ట్రూత్‌ సోషల్‌ అకౌంట్‌లో ఓ సందేశాన్ని ఇస్తూ రెండు దేశాలు సమంజసమైన, దీషఞఞఞర్ఘకాలం నిలిచే ఒప్పందానికి వచ్చే విషయంలో మధ్యవర్తిత్వ పాత్రను నిర్వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నదని చెప్పారు. దీనిపై ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసీకి లేఖ పంపానని అన్నారు. ఇతరులకు హాని కలిగించే విధంగా నైలు నదిపై ఏ ఒక్క దేశం ఏకపక్షంగా పెత్తనం చెలాయించకూడదని చెప్పారు. ఎగువనున్న ఇథియోపియా నైలునదిపై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దీంతో తమకు నీటి ప్రవాహం తక్కువగా ఉంటోందని ఈజిప్ట్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నీటి లభ్యత తక్కువ కావడంతో వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బంది కలుగుతోందని, ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటోందని తెలిపింది.

ఇథియోపియాకు దిగువన, ఈజిప్టుకు ఎగువన ఉన్న సూడాన్‌ కూడా నీటి భద్రత, డ్యామ్‌ రక్షణపై ఆందోళన చెందుతోంది. ఈజిప్టుకు నైలు నది అవసరం ఎంత ఉన్నదో తనకు తెలుసునని ట్రంప్‌ చెప్పారు. ఈజిప్ట్‌, ఇథియోపియా, సూడాన్‌ దేశాల ప్రయోజనాలను రక్షించే విధంగా ఒప్పందం కుదరాలని ఆయన ఆకాంక్షించారు. ‘సరైన సాంకేతిక పరిజ్ఞానంతో… నిస్పాక్షిక, పారదర్శక సంప్రదింపులతో…అన్ని పక్షాల మధ్య పర్యవేక్షణ, సమన్వయం సాధించడంలో బలమైన పాత్రధారిగా అమెరికా దీర్ఘకాలిక ఒప్పందాన్ని సాధిస్తుంది’ అని చెప్పుకొచ్చారు. కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు ఈజిప్ట్‌, సూడాన్‌లకు నీటి విడుదల జరిగేలా చూడడంతో పాటు విద్యుదుత్పత్తికి ఇథియోపియాను అనుమతించాల్సి ఉంటుందని తెలిపారు. మిగులు జలాలను అందరూ పంచుకోవచ్చునని ట్రంప్‌ అన్నారు. నైలు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు గతంలో ప్రపంచ దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ వ్యవహారంలో మరోసారి జోక్యం చేసుకోవడానికి అమెరికా సిద్ధంగా ఉన్నదని ట్రంప్‌ మాటలను బట్టి అర్థమవుతోంది. అయితే ఆయన వ్యాఖ్యపై ఈజిప్ట్‌ కానీ, ఇథియోపియా కానీ ఇంకా స్పందించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -