- Advertisement -
గోకుల్ తాండ సర్పంచ్ మోహన్ నాయక్
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రజలు నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు , బాధ్యతగా సేవ చేసుకుంటానని , గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని గోకుల్ తాండ సర్పంచ్ మోహన్ నాయక్ అన్నారు. మంగళవారం తండాలోని పెద్దమనుషులు శాలువాలతో సన్మానించారు. పెద్ద మనుషులు మాట్లాడుతూ… పంచాయతీ పాలకవర్గం గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని, ఎన్నికలు జరిగినంత సేపే పార్టీలని, పూర్తయిన తర్వాత గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద మనుషులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



