Thursday, February 26, 2026
E-PAPER
Homeఖమ్మంగడప గడపకు సేవలందిస్తా

గడప గడపకు సేవలందిస్తా

- Advertisement -

– బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్ధిని నాగశేషపద్మ
నవతెలంగాణ –  అశ్వారావుపేట 

ఎన్నికల ప్రచారంలో నేడు ఇంటింటికీ తిరిగి నట్లే నాకు ఓటు వేసి గెలిపిస్తే రేపు గడప గడపకు సేవలు అందిస్తానని బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్ధిని కాసాని నాగ శేష పద్మ ఓటర్లకు బరోసా ఇచ్చారు. గురువారం తాను కౌన్సిలర్ అభ్యర్ధిని గా పోటీ చేసిన 8 వ వార్డులో విస్త్రుత ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం వీధికి వీధికి తిరుగుతున్న సమయంలో ఆయా గృహస్తులు పడుతున్న వీధి దీపాలు లేమి,మంచినీటి సరఫరాలో జాప్యం,మురుగు కాలువలు లో పారిశుధ్యం మెరుగు వుంటే అనేక సమస్యలను నమోదు చేసుకుంటున్నామని ఆమె తెలిపారు.వీటికి శాస్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పేరాయి గూడెం  మాజీ సర్పంచ్ సుమతి,తెలుగుదేశం నాయకులు కట్రం స్వామి దొర,బీఆర్ఎస్ నాయకులు సోడియం వీరభద్రం,పాలవలస జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -