Monday, July 7, 2025
E-PAPER
Homeజిల్లాలుఅమ్మల్లాంటి మహిళలకు నేను అండగా ఉంటా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

అమ్మల్లాంటి మహిళలకు నేను అండగా ఉంటా: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: సమాజంలో తల్లి ప్రేమను మించింది లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మదర్ ఎడ్యుకేషన్ & రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితకుట్టు శిక్షణ ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ధ్రువపత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..అమ్మల్లాంటి మహిళల కోసం నేను అండగా ఉంటానని అన్నారు. మహిళల కమిట్మెంట్ చాలా గొప్పదనీ, వారి కుటుంబం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారని తెలిపారు. ఈ రోజుల్లో మహిళలు రాణించని రంగం లేదని అన్నారు.

యుద్ధ విమానాలు నడుపుతున్నారనీ, యుద్దాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. మన మునుగోడు నియోజకవర్గంలో మీ భర్త తప్పు చేస్తే నిలదీయ్యండి. వినకపోతే నాకు చెప్పండని ఈ వేదికపైనుంచి మహిళలకు పిలుపునిచ్చారు. మహిళలను హింసించె వారు ఇప్పటికైనా మారాలని ఉద్భోదించారు. మహిళలు ధైర్యంగా ఉండాలి, భర్త వైఖరిని మార్చాలని అన్నారు. కుటుంబం గురించి అర్ధం అయ్యేలా వివరించాలనీ మహిళలను కోరారు. మహిళా ఫౌండేషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఉచితంగా కుట్టు శిక్షణ తీసుకున్న మహిళలను ఆయన అభినందించారు. చౌటుప్పల్ ము న్సిపాలిటీలో 67% మంది మహిళలు శిక్షణ పొందేలా తోడ్పాటును అందించిన  బొజ్జ సంధ్య రెడ్డి సేవలు మర్చిపోకూడదని తెలిపారు.

సంధ్యారెడ్డి లాంటి వారికీ నా సహకారం, ప్రభుత్వ సహకారం ఉంటుందని అన్నారు. మహిళలు ఉచితాలు అడగడం లేదు.. వాళ్ళ కాళ్ళ పైన కష్టపడతారు, అదే కోరుకుంటున్నారని తెలిపారు. నిన్న పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందజేసిన కార్యక్రమంలో 80% మంది విద్యార్థినులు ఉన్నారని గుర్తు చేశారు. నేను మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్మూలనను సాధ్యం చేశానని, మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అన్నారు. మా అమ్మ గారి పేరిట కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రూ.15 కోట్లతో వృద్ధాశ్రమం స్థాపించానని, కరోనా సమయంలో కోట్లాది రూపాయలతో నిత్యావసర సరుకులు అందించానని, రూ.25 లక్షలతో విద్యలో ఉత్త్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించడానికి నగదు బహుమతి ఇచ్చానని తెలిపారు.

వలిగొండ రోడ్ లో ఒక ఎకరం స్థలాన్ని ప్రభుత్వం తరపున కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ కోసం అవసరమైతే రూ.5 కోట్ల వరకు ఖర్చు చేసి, భవనం కట్టిస్తానని మహిళలకు ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -