Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటా: చలమల్ల కృష్ణారెడ్డి

మునుగోడు నియోజకవర్గ ప్రజలను ఆదుకుంటా: చలమల్ల కృష్ణారెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల సాగు చేసిన పత్తి పంట పాడైపోవడంతో అప్పు తీర్చే మార్గం లేక మానసికంగా కృంగిపోయి మనస్థాపానికి గురై మృతి చెందిన రైతుకు రూ.1 లక్ష ఆర్థిక సహాయంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి అందజేశారు. ఆదివారం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పత్తి రైతు ఇటికాల ఉపేందర్ రెడ్డి పత్తి పంట
చేతికి అందకపోవడంతో అప్పుల బాధతో మృతి చెందిన విషయం తెలుసుకొని చలమల్ల కృష్ణారెడ్డి మానవత దృక్పథంతో ఆర్థిక సాయం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భవిష్యత్తులో ఉపేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, వారి పిల్లల చదువులకు మరింత సహాయం చేస్తానని చలమల్ల కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -