Thursday, November 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఘోస్ట్‌ హంటర్‌గా సర్‌ప్రైజ్‌ చేస్తా..

ఘోస్ట్‌ హంటర్‌గా సర్‌ప్రైజ్‌ చేస్తా..

- Advertisement -

సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటించిన సూపర్‌ నేచురల్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌ ‘జటాధర’. ఈ పాన్‌-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్‌, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌, శివిన్‌ నారంగ్‌, అరుణ అగర్వాల్‌, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్‌, నిఖిల్‌ నందా నిర్మించారు.
శిల్పా శిరోధ్కర్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఈనెల 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌ బాబు మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
చిన్నప్పుడు మనం జానపద, చందమామ కథలు వినుంటాం. బ్యాంకులు లేని సమయంలో ధనాన్ని భూమిలో పాతి, ఒక బంధనం వేసి, దానికి ఒక పిశాచి కాపలాగా ఉంటుంది అని ప్రచారంలో ఒక కథ ఉండేది. ఈ కథకు అలాంటి ఒక జానపదం ఆధారం. అలాంటి కథని ప్రజెంట్‌ టైంలోకి వచ్చి తీసుకొచ్చి, చాలా ఆసక్తికరంగా ప్రజెంట్‌ చేశారు. బిగ్‌ స్క్రీన్‌ మీద చూడదగ్గ కథ. ఘోస్ట్‌ హంటింగ్‌, ఫ్యామిలీ ఎమోషన్‌, డివోషనల్‌, శివుడు గురించి కథలు. ఇలా చాలా లేయర్స్‌ ఉన్నాయి.

అరుణాచల ప్రస్తావన కూడా ఉంది. సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్‌కి మన పురాణాల్లో ఉన్న కొన్ని కథలు సొల్యూషన్‌గా ఈ కథను చేశాం. ఈ సినిమా చేయడానికి ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ నన్ను చాలా ఎగ్జైట్‌ చేేసింది. ఇందులో ఘోస్ట్‌ హంటర్‌గా కనిపిస్తా. అయితే తనకి దెయ్యాలు ఉన్నాయంటే నమ్మకం ఉండదు. దేవునిపై నమ్మకం ఉంటుంది. సైన్స్‌ని నమ్ముతాను. అలా ఎందుకనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జటాధర’ అనే టైటిల్‌ వినగానే ఇది డివైన్‌ సినిమా అని తెలుస్తుంది. ఫైనల్‌గా శివుడు వస్తాడని ముందే అర్ధమౌతుంది. అయితే ఆ పాయింట్‌కి రీచ్‌ అయ్యేవరకూ ఉండే జర్నీ చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది.

ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తుంది. సోనాక్షి చాలా అద్భుతమైన నటి. ధనపిశాచి క్యారెక్టర్‌కి చాలా వాల్యూ యాడ్‌ చేశారు. శోభ అనే పాత్రలో శిల్ప కనిపిస్తారు. అద్భుతంగా నటించారు. చాలా హెవీ పెర్ఫార్మన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ అది. సినిమా తర్వాత తనకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. తన పర్ఫార్మెన్స్‌ అవుట్‌ స్టాండింగ్‌ ఉంటుంది. రాజీవ్‌ మ్యూజిక్‌ని చాలా అద్భుతంగా చేశాడు. ఇందులో శివతాండవం ఎపిసోడ్‌ ఉంటుంది. అది థియేటర్స్‌లో గ్రేట్‌ ఎక్స్పీరియన్స్‌ ఇస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌తో ఒక సినిమా ఉంది. ఇప్పటివరకు అలాంటి కాన్సెప్ట్‌ వరల్డ్‌ సినిమాల్లో రాలేదు. కాన్సెప్ట్‌ పరంగా అది ఒక ‘బాహుబలి’ లాంటి సినిమా. అలాగే పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌ కూడా చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -