Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా 

గద్వాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తా 

- Advertisement -

– అభివృద్ధిపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టెందుకు ఎక్కడి దాకా అయినా వెళ్తా
–  రహదారుల పునరుద్దరణకు రూ. 316 కోట్ల నిధులు మంజూరు 
– ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

గద్వాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, అభివృద్ధి కోసం ఎక్కడిదాకైనా వెళ్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గద్వాల రోడ్ల నిర్మాణానికి రూ.316 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.

రూ.10వేల కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర రోడ్ల పునరుద్ధరణకు గురువారం క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  అన్నారు. నవంబర్ 25 తర్వాత నర్సింగ్ కళాశాల ప్రారంభం, మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర‌ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కి  గద్వాల ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

గద్వాల నియోజకవర్గ పరిధిలోని హామ్ ద్వారా ఆర్ అండి బి రోడ్లు
ఎరిగెర- అయిజ- అలంపూర్ రోడ్(బల్గెర, మిట్టదొడ్డి, తుమ్మలపల్లి) రూ.9.61 కోట్లు, గద్వాల్ – రంగాపూర్ రోడ్డు గద్వాల, జమ్మిచేడు, పూడూరు x రోడ్, వీరాపురం, పుటాన్ పల్లి, అనంతపురం ఎర్రవల్లి) రూ.39.84 కోట్లు. గద్వాల రాయచూర్ రహదారి రూ.74.29 కోట్లు. గద్వాల అయిజ‌ రోడ్డు(గద్వాల, పరుమాల, కుర్వపల్లి, పెద్దపల్లి, బూడిదపాడు, అమరవాయి, మల్దకల్) రూ.24.32కోట్లు. బల్గెర మాచర్ల రోడ్డు రూ.1.5కోట్లు. గట్టు మాచర్ల రోడ్డు (20/2 నుండి 25/3) రూ.12.80 కోట్లు. 
మొత్తం రూ.162.45 కోట్లు మంజూరయ్యాయి అని తెలిపారు.

అదే విధంగా హ్యామ్​ (హైబ్రిడ్​ యాన్యుటీ మోడల్​) ద్వారా గద్వాల్ నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.154కోట్ల నిధులు మంజూరైనట్లు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు వెల్లడించారు.

హ్యామ్(పంచాయతీరాజ్) నిధులు కేటాయించిన రోడ్ల వివరాలు: రూ.154కోట్లు

పీడబ్ల్యూడి రోడ్ నుండి పార్చర్ల. పీడబ్ల్యూడి రోడ్ నుండి కొత్తపాలెం.
మార్లబీడు పీడబ్ల్యూడి రోడ్ నుండి కోతుల గిద్ద, ఫీజేపీ రోడ్ నుండి బీంపురం, పీడబ్ల్యూడి రోడ్ నుండి బస్వాపూర్ వయా అనంతపూర్, నందిన్నె నుండి మాచర్ల, వాయిల్ కుంట తండా నుండి మల్లాపూరం తండా, మల్దకల్ జడ్పీ రోడ్ నుండి ఆరగిద్ద,గొర్లఖాన్ దొడ్డి నుండి ఆరగిద్ద, రంగాపూర్ నుండి బస్వాపూర్, పీడబ్ల్యూడి రోడ్ నుండి పాతపాలెం, పీడబ్ల్యూడి రోడ్ నుండి ముసల్ దొడ్డి వయా కొండాపురం, పీడబ్ల్యూడి రోడ్ నుండి పూజారి తండా వయా గువ్వలదిన్నె, పీడబ్ల్యూడి రోడ్ నుండి రంగాపుర్ వయా మైలగడ్డ, మల్దకల్ నుండి విఠాలపూర్ వయా ఎల్కూర్, బిజ్వారం నుండి మద్దెలబండ వయా ఉలిగేపల్లి, నేతువానిపల్లి, ఉల్లిగేపల్లి నుండి దాసరపల్లి. గ్రామీణ రోడ్డు పునరుద్ధరణకు రూ.154 కోట్లు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా గద్వాల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా గద్వాలలో నర్సింగ్ కళాశాల నిర్మాణం పూర్తి కావడం జరిగింది. నవంబర్ 25 నాడు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి గారి చేత మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది అదేవిధంగా 80 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం నిర్మాణం భూమి పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా రైతులు పండించిన వరి ధాన్యంలో గోదాంలో నిల్వ ఉంచడానికి గోదాములను కేటాయించడం జరిగింది గద్వాల నుండి ఇతర ప్రాంతాలకు ధాన్యమును సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. 

 తనపై నమ్మకం ఉంచి నన్ను రెండుసార్లు గెలిపించిన గద్వాల నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం గద్వాల నియోజకవర్గంలోని నా చివరి శ్వాస వరకు గద్వాల  అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా  సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి,  ఆలయ కమిటి చైర్మన్ వెంకట్రాములు, మాజీ జడ్పీటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, విజయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్ మురళి, నాయకులు విక్రమ్ సింహా రెడ్డి, కురుమన్న, నాగులు యాదవ్,  చంద్రశేఖర్ రిజ్వాన్, నర్సింహులు , సంగాల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -