బీఆర్ఎస్ తరుపున నామినేషన్ దాఖలు చేసిన మెండే సైదులు యాదవ్
నవతెలంగాణ – పెద్దవూర
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి సమస్యను భాద్యతగా పరిష్కరిస్తానని, మండల పరిధిలోని తుంగతుర్తి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి మెండే సైదులు అన్నారు. సోమవారం ఆయన సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తుంగతుర్తి గ్రామ అభివృద్దికి తన శక్తికి మించి పని చేస్తానని అన్నారు. అందుకు ప్రభుత్వం నుంచి నిధులను తీసుకొచ్చి, సక్రమంగా అందరకీ తెలిసేలా ఖర్చు చేస్తానని అన్నారు. గ్రామాన్ని అభివృద్ది పథంలో ముందుకు నడిపిస్తానని తెలిపారు. ఎక్కడెక్కడ ఏఏ సమస్యలు ఉన్నాయో క్షణ్ణంగా పరిశీలించి, అందుకు ఎలా చేస్తే బాగుంటుందనేది అందరి అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళతానని అన్నారు. డబ్బులు పెట్టి గెలిచిన అభ్యర్థులు గెలిచాక తిరిగి ఆ డబ్బులను ఎలా రాబట్టాలనే ఆలోచిస్తారు తప్ప ఊరు అభివృద్ది గురించి పట్టించుకోరని అన్నారు. నన్ను నమ్మి గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉందన్నారు. నేను నాయకుడిగా కాకుండా మీ సేవకుడిగా పని చేస్తానని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు ఓటు వేసేముందు బాగా ఆలోచించి వేయండని సూచించారు.
తుంగతుర్తి అభివృద్దికి శక్తివంచన లేకుండా పనిచేస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



