Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వివేక్ కుటుంబీకులకు న్యాయం చేసేలా కృషి చేస్తా

వివేక్ కుటుంబీకులకు న్యాయం చేసేలా కృషి చేస్తా

- Advertisement -

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 
నవతెలంగాణ – మిరుదొడ్డి 

సమాధుల వివేక్ మృతి పట్ల సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లాలగడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సనాదుల వివేక్ అనుమానాస్పదంగా మన్నించాడని వారు వెల్లడించారు. ప్రభుత్వం ఈ యొక్క మరణం పట్ల సమగ్ర విచారణ చేపట్టి మృతుడి కుటుంబాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు  తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య  సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వారి వెంట జాతీయ మాల మహానాడు బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు,అల్లిబిల్లి నరసింగరావు, రమేష్ ,కనకయ్య, రాములు, సన్నీ రాకేష్, కళ్యాణ్ ,నాని, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -