కాంగ్రెస్ గూటికి తాళ్లపల్లి సర్పంచ్ నీల ప్రభాకర్
నవతెలంగాణ – మిరుదొడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాహిత పథకాలకు ఆకర్షితులై, దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపాటుకు తోడ్పడుతూ తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాల్లపల్లి గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్ మాట్లాడుతూ.. దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల మద్దతు పెరుగుతోందని, నీల ప్రభాకర్ చేరికతో పార్టీ మరింత శక్తివంతమై విజయదిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని అన్నారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని అన్నారు. రైతులకు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, దుబ్బాక మరియు మిరుదొడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్లు కొంగరి రవి, బొమ్మర సంయుక్త శ్రీధర్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్, బేగంపేట గ్రామ సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, తాళ్లపల్లి ఉప సర్పంచ్ పాతూరి నవీన్ గౌడ్, నగరం ఉప సర్పంచ్ జీడిపల్లి రమేష్, , సీనియర్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.



