‘ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి ఉన్నప్పుడు ట్రై యాంగిల్ లవ్ స్టొరీ అనుకుంటారు. కానీ ‘తెలుసు కదా’లో ఒక యూనిక్ పాయింట్‌ని టచ్ చేశాం. అది ఇప్పుడు రివీల్ చేయకూడదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు’ అని కథానాయిక శ్రీనిధి శెట్టి అన్నారు. ‘మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 17న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాయిక శ్రీనిధి శెట్టి మీడియాతో ముచ్చటించారు.
ఫస్ట్ టైం లవ్ స్టోరీ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు రొమాంటిక్ స్టోరీస్ చేయడం ఇష్టం. ‘కేజీఎఫ్, హిట్ 3’ యాక్షన్, చాలా బ్లడ్ బాత్ ఉన్న సినిమాలు. ‘తెలుసు కదా’ ఒక లైట్ హార్టెడ్ మూవీ. చాలా కొత్తగా ట్రై చేశాం. ఇందులో లవ్, ఎమోషన్, లాఫ్, సాంగ్స్.. అన్ని కమర్షి యల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ మంచి రొమాంటిక్ డ్రామాని ఫీల్ అవుతారు.
దర్శకురాలు నీరజ చాలా ప్యాషన్‌తో సినిమా చేశారు. ఆమె విజన్ ఆడియన్స్‌కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఇందులో చాలా కొత్త పాయింట్ వుంది. ఇందులో మూడు క్యారెక్టర్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. థియేటర్స్‌లో చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సిద్ధు క్యారెక్టర్‌ని చాలా ఎంజాయ్ బాగా చేస్తారు.
ఇందులో నేను రాగ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్రకు నిజ జీవితంలో నా క్యారెక్టర్‌కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే ఇందులో కొంత గ్రే షేడ్ ఉంది. పర్సనల్‌గా నేను అలా ఉండలేను. అయితే ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్‌ని చేయలేదు. అలాగే రాశి ఖన్నా పాత్ర కూడా బాలా బాగుంటుంది. తమన్ మ్యూజిక్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. నేను నటించిన ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ చేయడం ఆనందంగా ఉంది. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బీజీఎం చాలా అద్భుతంగా ఉంటుంది. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ప్యాషన్‌తో సినిమా చేస్తారు. వారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేం. ఈ సినిమా నుంచి పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా చాలా విషయాలు నేర్చుకున్నాను. వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో మీరు నటిస్తున్నారట కదా అని అడుగుతున్నారు. నిజంగా నాకు తెలీదు. ఆ సినిమా అవకాశం రావాలని కోరుకుంటున్నాను. ఆ సినిమాలో ఎవరు హీరోయిన్ అనేది నిర్మాతలే చెబుతారు (నవ్వుతూ).
ఆ.. అవకాశం రావాలని కోరుకుంటున్నా
- Advertisement -
- Advertisement -