నవతెలంగాణ – నసురుల్లాబాద్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల్లో ఆదివారం ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉదయం బాన్సువాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అలాగే నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీర్కూర్ కమప్ప చౌరస్తా వద్ద గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో నిర్వహించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. సిట్ విచారణ పేరుతో అక్రమంగా కేసీఆర్ పై బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని, ఫోన్ టాపింగ్ అంశాన్ని వక్రీకరించి బీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేతపై రాజకీయ కక్షసాధింపుతో చర్యలు చేపడుతున్నారని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ నాయకులు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గొడిసేల నర్సింలుగౌడ్,టేకుర్ల సాయిలు, గంపల శంకర్, రమేష్, ఉప్పర్ సాయిలు, మోసిన్ , కనుకుంట్ల శీను, లక్ష్మణ్, కుమార్, రాజు రాథోడ్ భూమయ్య, లక్ష్మణ్, షేక్ షఫీ, సాయిలు, అల్లం గంగారం, రవి, శంకర్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



