Wednesday, May 21, 2025
Homeరాష్ట్రీయంఐఏఎస్‌లు గీత దాటొద్దు

ఐఏఎస్‌లు గీత దాటొద్దు

- Advertisement -

– పబ్లిక్‌ మీటింగుల్లో అనాలోచిత చర్యలు సరికాదు : సీఎస్‌ రామకృష్ణారావు మెమో జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఐఏఎస్‌లు గీత దాటొద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం మెమో జారీ చేశారు. ప్రజా సమావేశాల్లో అనుచిత ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. ఇటీవలి కాలంలో అఖిల భారత సర్వీసుల అధికారులు బహిరంగ సభలు, ఇతర సమావేశాల్లో సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌కు విరుద్దంగా హావభావాలను ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. 1964 తెలంగాణ సివిల్‌ సర్వీస్‌ రూల్స్‌ (ప్రవర్తనా నియమావళి)కి మచ్చ తెచ్చే చర్యలు తగవని అన్నారు. ఇలాంటి ప్రవర్తనతో అధికారులపై ప్రజల్లో చులకన భావం ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాగర్‌కర్నూలు జిల్లా అధికారిక పర్యటనలో ఐఏఎస్‌ అధికారి శరత్‌ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కాళ్లు మొక్కిన నేపథ్యంలోనే సీఎస్‌ మెమో జారీ చేసినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -