Tuesday, September 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్కార్‌ దవాఖానాలో ఐఏఎస్‌ సతీమణి ప్రసవం

సర్కార్‌ దవాఖానాలో ఐఏఎస్‌ సతీమణి ప్రసవం

- Advertisement -

– భద్రాచలం ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చిన ఐటీడీఏ పీవో భార్య
నవతెలంగాణ-భద్రాచలం

ఐఏఎస్‌ అధికారి.. ఐటీడీఏ పీవో అధికారులందరికీ ఆదర్శంగా నిలిచారు. తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఐటీడీఏ పీవో రాహుల్‌ సతీమణి మనీషా రాహుల్‌ పురుడు పోసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఫ్రీ డెలివరీ అవుతుందేమోనని వేచి చూశారు. కానీ కుదరక పోవడంతో శుక్రవారం తెల్లవారుజామున ఆపరేషన్‌ చేయగా 3.16 నిమిషాలకు పండంటి మగ బిడ్డ పుడ్డాడు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయినప్పటికీ బి.రాహుల్‌ ప్రయివేట్‌ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో తన సతీమణికి ప్రసవం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు పలువురు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -