Thursday, July 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసరోజినీ కంటి ఆస్పత్రిలో ఐఏఎస్‌ సబ్యసాచికి వైద్యం

సరోజినీ కంటి ఆస్పత్రిలో ఐఏఎస్‌ సబ్యసాచికి వైద్యం

- Advertisement -

వైద్యులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ చికిత్స చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు పలువురు ఉన్నతాధికారులూ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రభుత్వ కంటి ఆస్పత్రి అయిన సరోజినీ దేవి నేత్ర వైద్యశాలలో ఆయన కంటికి వైద్యులు సర్జికల్‌ ప్రొసీజర్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.మోదినీ మాట్లాడుతూ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో చికిత్స కోసం సబ్యసాచి రావడం ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ఆయనకు ఫుల్‌ రీయింబర్స్‌మెంట్‌తో ప్రయివేటు కంటి ఆస్పత్రిలో చికిత్స చేసుకునే సౌకర్యం ఉన్నా మెరుగైన ఫలితాల కోసం ఆయన సరోజినీ దేవి కంటి ఆస్పత్రినే ఎంచుకున్నారని ఆమె చెప్పారు. చికిత్స అనంతరం సబ్యసాచి మాట్లాడుతూ ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో తనకు ఇచ్చిన చికిత్స, చూపించిన ఆరోగ్య సంరక్షణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -