Friday, January 9, 2026
E-PAPER
Homeఆటలుబిసిసిఐ కనుసన్నల్లో ఐసిసి

బిసిసిఐ కనుసన్నల్లో ఐసిసి

- Advertisement -

బంగ్లాదేశ్‌ అభ్యర్థ తిరస్కరణ
టి20 ప్రపంచకప్‌ వేదికలు మార్చేది లేదంటూ ప్రకటన

దుబాయ్‌: భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు (ఐసిసి) కనుసన్నల్లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) నడుస్తున్నట్లు ఉంది. ఐసిసికి వేలకోట్ల రూపాయలు ముట్టజెప్తున్న బిసిసిఐ మాటకే విలువ ఇస్తూ.. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బిసిబి) అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. టి20 ప్రపంచకప్‌ టోర్నీ వేదికలు ఇప్పటికే ఖరారయ్యాయని, ఇప్పటికప్పుడు వేదికలు మార్చడం సాధ్యం కాదని, తప్పనిసరిగా ఇండియాకు వెళ్లి మ్యాచ్‌లు ఆడాల్సిందేనని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే బంగ్లా ఆడే మ్యాచ్‌ల సందర్భంగా ఎలాంటి ఎరుపురంగు జెండాలు, దుస్తులు, నిరసనలు తెలియజేయకూడదని స్పష్టం చేసింది.

ఒకవేళ మ్యాచ్‌లు ఆడకుంటే పాయింట్లను కోల్పోవాల్సి వస్తుందని ఐసిసి తెలిపింది. బంగ్లా క్రికెటర్‌ను ఐపిఎల్‌లో ఆడకుండా అడ్డుకోవడానికి గల కారణాలపై సీరియస్‌గా తీసుకున్న అక్కడ ప్రభుత్వం 2026 ఐపిఎల్‌ ప్రసారాలపై నిషేధం విధిస్తూ ఒక ప్రకటన జారీ చేసింది. అలాగే భారత్‌ వేదికగా ఫిబ్రవరిలో జరిగే టి20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ జట్టు ఆడే మ్యాచ్‌ల వేదికలను మార్చాలంటూ ఐసిసికి ప్రతిపాదన పంపింది. బంగ్లాదేశ్‌ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని కోరింది. తాజాగా ఐసిసి బంగ్లాదేశ్‌ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. గ్రూప్‌- సిలో ఉన్న బంగ్లాదేశ్‌ జట్టు ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌, 9న ఇంగ్లండ్‌, 17న నేపాల్‌తో గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -