Thursday, January 8, 2026
E-PAPER
Homeఆటలుబంగ్లాదేశ్‌తో భేటీ కానున్న ఐసీసీ!

బంగ్లాదేశ్‌తో భేటీ కానున్న ఐసీసీ!

- Advertisement -

షెడ్యూల్‌ ప్రకారమే టీ20 ప్రపంచకప్‌
ముంబయి :
ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించటంతో భద్రత కారణాల రీత్యా భారత్‌లో బంగ్లాదేశ్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆడబోదని ఆ దేశ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) ఐసీసీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ఉన్నతాధికారులతో సమావేశమయ్యేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది. ఐసీసీ చైర్మెన్‌ జై షా సహా ఇతర బీసీసీఐ అధికారులు మంగళవారం ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో తాజా పరిస్థితిపై చర్చలు జరిపారు. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబయిలో షెడ్యూల్‌ చేశారు. వెస్టిండీస్‌, ఇటలీ, ఇంగ్లాండ్‌తో ఈడెన్‌గార్డెన్స్‌లో.. నేపాల్‌తో వాంఖడెలో ఆడాల్సి ఉంది. ప్రస్తుత షెడ్యూల్‌ ప్రకారమే భారత్‌లోనే మ్యాచ్‌లు ఆడాలని బీసీబీని ఐసీసీ కోరనున్నట్టు సమాచారం. ఇప్పటికే టికెట్ల అమ్మకాలు, లాజిస్టిక్స్‌ సహా ఇతర అంశాల్లో మార్పు చేయలేని పరిస్థితిని బీసీబీ అధికారులకు ఐసీసీ వివరించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -