- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: శీతాకాలం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా మంచు కురుస్తోంది. ఈ మంచు కారణంగా కొన్ని చోట్ల అవలాంఛ్‌లు ఏర్పడుతుండగా.. మరికొన్ని చోట్ల మంచు సునామీలు సంభవిస్తున్నాయి. తాజాగా చైనాలో మంచు సునామీ వచ్చింది. జిన్‌జియాంగ్ ప్రాంతంలో గడ్డ కట్టిన ఓ నదిలో ‘మంచు సునామీ’ అలలు ఏర్పడ్డాయి. చెట్లపై ఉన్న మంచు సైతం ఒక్కసారిగా కిందకు పడింది. మంచు సునామీని చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన భయంకర వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
- Advertisement -



