Tuesday, February 17, 2026
E-PAPER
Homeబీజినెస్ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ రెవెన్యూలో 39 శాతం వృద్ధి

ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ రెవెన్యూలో 39 శాతం వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఐస్‌ మేక్‌ రిఫ్రిజిరేషన్‌ రెవెన్యూ 39 శాతం పెరిగి రూ.153 కోట్లకు చేరింది. ఈ పారిశ్రామిక శీతలీకరణ పరిష్కారాల సంస్థ ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.110.56 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. గడిచిన క్యూ3లో రూ.1.45 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. 2025 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో రూ.412.35 కోట్ల రెవెన్యూతో.. రూ.2.01 కోట్ల లాభాలను నమోదు చేసిందని ఆ కంపెనీ సీఎండీ చంద్రకాంత్‌ పి పటేల్‌ తెలిపారు. ఆహార, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ మాకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -