Tuesday, July 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మెకు ఐసీఈయు సంపూర్ణ మద్దతు

సార్వత్రిక సమ్మెకు ఐసీఈయు సంపూర్ణ మద్దతు

- Advertisement -

ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సదయ్య, రాజు 
నవతెలంగాణ – పరకాల 
: దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపునకు ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ పరకాల బ్రాంచి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. బీమా ప్రీమియంపై జిఎస్టి తొలగించాలని, 1996 బ్యాచ్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, జీవిత భీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కోరుతూ అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ నిలిపివేయాలని  డిమాండ్ చేస్తూ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుందన్నారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఐ సి ఈ యు పరకాల బ్రాంచ్ కమిటీ పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ సమ్మెలో అన్ని కార్మిక సంఘాలు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సంపూర్ణ మద్దతు ప్రకటించి, విజయవంతం చేయాలని, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సదయ్య, రాజులు ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -