– వ్యకాస అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
– వైరాలో సంస్మరణ సభ
– 11న లాలాపురంలో మధుసూదన్‌రావు స్థూపావిష్కరణ
నవతెలంగాణ-వైరాటౌన్
సీపీఐ(ఎం) నిర్మాణమే దిక్సూచిగా పీడిత ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నిబద్ధత కలిగిన ఆదర్శ కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ సంక్రాంతి మధుసూదన్‌రావు అని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. ఆయన వేసిన పోరుబాటలో పయనిద్దామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, కొణిజర్ల మండలం వైరా ప్రాంతం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ సంక్రాంతి మధుసూదన్‌రావు సంస్మరణ సభ మంగళవారం బోడేపూడి భవనంలో చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగింది. మధుసూదన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో బి.వెంకట్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటంలో అమరుడైన తన బాబాయి సంక్రాంతి రామచంద్రయ్య స్ఫూర్తితో క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు నాయకుడిగా మధుసూదన్‌రావు ఎదిగారని వివరించారు. అధ్యయనం – ఆచరణే గీటురాయిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహనీయులలో మధుసూదన్‌రావు ఒకరని తెలిపారు. ఒక్కడిగానే నిలబడి కొణిజర్ల మండలం, వైరా ప్రాంతంలో సీపీఐ(ఎం)ని నిర్మించి నిలబెట్టారని అన్నారు. రాజకీయ దాడులు, కోర్టు కేసులను ధైర్యంగా ఎదుర్కొని పార్టీని నిలబెట్టడానికి, బలోపేతం చేసేందుకు జీవితాంతం కృషి చేసిన మధుసూదన్‌రావు ఆశయాల సాధనకు కృషి చేయడమే నిజమైన నివాళులు అన్నారు.
సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ.. బోడేపూడి వెంకటేశ్వరరావు మార్గదర్శకత్వంలో సంక్రాంతి మధుసూదన్‌రావు పయనించి.. వెట్టి చాకిరీ, కుల వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించి దళితులు, పేద ప్రజల మృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. పార్టీని దెబ్బతీయడం కోసం పాలకవర్గాలు, రాజకీయ పక్షాలు చేసిన కుట్రలను భగం చేస్తూ పేదల పక్షాన నిలబడ్డారని చెప్పారు. మే 11న ఉదయం 9 గంటలకు వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో జరిగే సంక్రాంతి మధుసూదన్‌రావు స్మారక స్థూపం ఆవిష్కరణ, సంస్మరణ సభలో సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, ఎం.సాయిబాబు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు పాల్గొంటారని తెలిపారు. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, డివిజన్ కమిటీ సభ్యులు మచ్చా మణి, ఎస్‌ఆర్ ఠాగూర్ విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్, నాయకులు బొంతు సమత, గుడిమెట్ల మోహన్‌రావు, కొంగర సుధాకర్, అనుమోలు రామారావు, షేక్ నాగుల్ పాషా, రాచబంటి బత్తిరన్న, కామినేని రవి, తోట కృష్ణవేణి, సంక్రాంతి పురుషోత్తమరావు, బెజవాడ వీరభద్రం, కంసాని మల్లికాంబ, యనమద్ది రామకృష్ణ, ఓర్పు సీతారాములు, పాపగంటి రాంబాబు, మల్లెంపాటి ప్రసాదరావు, మల్లెంపాటి రామారావు, దామ వెంకటేశ్వరరావు, మచ్పా కృష్ణమూర్తి, పారుపల్లి శ్రీనాథ్‌బాబు, ఎస్‌డి పాషా, మాడపాటి రామారావు, అమరనేని కృష్ణ, చావా కళావతి, తాటి కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ కమ్యూనిస్ట్ సంక్రాంతి మధుసూదన్‌రావు పీడిత ప్రజల కోసం జీవితాంతం పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES