Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఆదర్శంగా జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌

ఆదర్శంగా జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌

- Advertisement -
  • ఆరునెలల్లో రూ.15.50 లక్షల ఆదాయం
  • దేశంలోనే నారాయణపేట మహిళలు నిర్వహిస్తున్న తొలి బంక్‌

    నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
    నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంక్‌ ఆదర్శంగా నడుస్తున్నది. ఈ బంక్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరునెలల క్రితం ప్రారంభించారు. దేశంలోనే మహిళా సమాఖ్య నిర్వహిస్తున్న తొలి పెట్రల్‌ బంక్‌గా గుర్తింపు పొందింది. ఈ కాలంలో రూ.15.50 లక్షలు లాభం ఆర్జించిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి విధానాన్ని అమలు చేస్తున్నది. ఒకప్పుడు మహిళలు ఇంట్లో ఉంటూ కుట్లు, అల్లికలు, చిన్న, చిన్న వ్యాపారాలు చేయడం ద్వారా కుటుంబానికి చేదోడుగా నిలిచే వారనీ, ప్రజాపాలనలో మహిళలు వ్యాపార వేత్తలుగా రాణిస్తున్నారు. దేశ అభ్యున్నతికి చోదక శక్తిగా ఎదుగుతున్నారు. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో ఉన్న 8196 మహిళా సంఘాల్లో మొత్తం 91,369 మంది సభ్యులు ఉన్నారు. ఇందిరా మహిళా శక్తి పాలసీలో భాగంగా నారాయణపేట జిల్లా సింగారం రోడ్డులో రూ 1.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్‌ బంక్‌ను 21, ఫిబ్రవరి 2025న సీఎం ప్రారంభించారు. నెలకు రూ.10 వేల అద్దె చొప్పున 20 ఏండ్లపాటు బంక్‌ నిర్వహించేందుకు మహిళా సమాఖ్య బీపీసీఎల్‌తోపాటు జిల్లా గ్రామీణా భివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకున్నది. అందుకు అనుగుణంగా పెట్రోల్‌ బంక్‌ నిర్వహణకు సంబంధిం చిన 11 మంది మహిళలకు ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్‌ బంక్‌లలో మేనేజర్‌, సేల్స్‌ ఉమెన్‌లుగా తగిన శిక్షణను ప్రభుత్వం ఇప్పించింది.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad