Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గురుకులాల ఏర్పాటులో ఆదర్శం

గురుకులాల ఏర్పాటులో ఆదర్శం

- Advertisement -

సౌకర్యాలు కల్పించడంపై దృష్టి 
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ -నసురుల్లాబాద్ 
: బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్న గురుకుల పాఠశాలలకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం బీర్కూర్ జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో  రూ.26లక్షలతో నిర్మించనున్న అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి నేడు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పోచారం  మాట్లాడుతూ.. తాను కూడా సంక్షేమ  హాస్టళ్లలో చదివిన విద్యార్థినేన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్  ఛైర్మన్ కాసుల బాలరాజ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్యామల, వైస్ ఛైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు, తహశీల్దార్ లత, నాయకులు శశి, బోయిని శంకర్, బస్వరాజ్ పటేల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad