Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఆదర్శం.. వేముల బ్రదర్స్...

ఆదర్శం.. వేముల బ్రదర్స్…

- Advertisement -

విద్యాభివృద్ధికి విశేష కృషి 
ఉత్తమ సేవలకు ఇద్దరికి అవార్డులు 
ఉపాధ్యాయ దినోత్సవం వేడుకల్లో అరుదైన ఘటన 
నవతెలంగాణ -పెద్దవంగర

అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరే. సాంకేతికతను అందిపుచ్చుకుని, నిరుపేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారు. పేదరికం నుండి వచ్చిన, తల్లిదండ్రులు వేముల సరోజన, లక్ష్మణ్ ప్రోత్సాహంతో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడైతే, మరోకరు సర్వశిక్షా అభియాన్ లో కాంట్రాక్టు పద్ధతిలో క్లస్టర్ రిసోర్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో భాగంగా ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.‌

   మండలంలోని అవుతాపురం గ్రామానికి చెందిన వేముల ప్రకాశ్, వేముల సంతోష్ ఇద్దరు అన్నదమ్ములు. వీరి సేవలను గుర్తించిన లయన్స్ క్లబ్, విద్యాశాఖ వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఇరువురిని శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు. అన్నదమ్ములు ఇద్దరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    అన్న ప్రకాశ్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, టీచర్స్ బడి.ఇన్ వెబ్ సైట్ రూపొందించారు. ఈ వెబ్ సైట్ తో విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. డిజిటల్ సాధనాలతో భోదన చేపడుతూ విద్యార్థులకు సులమైన రీతిలో బోధిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.

తమ్ముడు సంతోష్ వృత్తిరీత్యా 2016 నుండి మండలం లో సీఆర్పీ గా పనిచేస్తూ, మండలానికి ఎంఐఎస్ కో ఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2016 నుండి మండలాన్ని ఆన్లైన్ రిపోర్టింగ్ లో జిల్లా లోనే మొదటి స్థానంలో నిలపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని, ఈ అవార్డుతో మా బాధ్యత మరింత పెరిగిందన్నారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad