నవతెలంగాణ-కమ్మర్ పల్లి : వన మహోత్సవంలో భాగంగా మండలానికి విచ్చేసే ముఖ్య ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనువుగా ఉన్న రెండు స్థలాలను గుర్తించినట్లు ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలోని గ్రీన్ సిటీలో, నాగపూర్ గ్రామ పరిధిలోని వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద వీఐపీల చేత వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటించేందుకు స్థలాలను గుర్తించి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అందులో భాగంగా గుర్తించిన రెండు స్థలాల్లో ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటేందుకు అనువుగా గుంతల్ని సిద్ధం కూడా సిద్ధం చేయిస్తున్నట్లు ఆయన వివరించారు. గ్రీన్ సిటీలో, వరద కాలువ హైడ్ రెగ్యులేటర్ వద్ద మొక్కలు నాటేందుకు గుంతల్ని వరుస క్రమంలో తీంచాలని ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ మంజూరానికి ఆయన సూచించారు. ఇష్టం వచ్చినట్లుగా గుంతలు తీస్తే మొక్కలు నాటితే చూసేందుకు బాగుండదని, వరుస క్రమంలో చూడ్డానికి అందంగా ఉండేలా గుంతల్ని సిద్ధం చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మండలానికి విచ్చేసే విఐపి ల చేత గుర్తించిన రెండు స్థలాల్లో మొక్కలు నాటించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు గంగా జమున, సంధ్య, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు రమా, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటేందుకు స్థలాల గుర్తింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES