Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్లఖపతి దీదీలను గుర్తించండి

లఖపతి దీదీలను గుర్తించండి

- Advertisement -

ఏపీఎం వెంకట్..
నవతెలంగాణ – బిచ్కుంద 

గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలవంతులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా సంవత్సరానికి లక్ష లోపు ఆదాయం కలిగిన సంఘాల్లో ఉన్న సభ్యులను గుర్తించాలని ఏపిఎం వెంకట్ అన్నారు. శనివారం బిచ్కుంద పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో గ్రామ సంఘాల అసిస్టెంట్లు, సీసీలతో సమావేశం ఏర్పాటు చేశారుఏ. ఈ సందర్భంగా ఏపీఏం మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి అర్హులైన వారికి ఐదు లక్షల లోపు వడ్డీ లేని రుణాలు, నైపుణ్య శిక్షణ, వ్యాపార అభివృద్ధికి అవసరమైన సహాయం అందిస్తామని అన్నారు.

ఆ కుటుంబాలకు జీవనోపాధి కల్పించి సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం పైన తీసుకురావడానికి సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. మండలంలో 7,990 సభ్యులకు గాను 3 వేల సభ్యులను గుర్తించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘాల అసిస్టెంట్లు, సీసీలు మైసయ్య, నర్సింలు, మారుతి, వెంకటేష్, మోహన్, అకౌంటెంట్ జబ్బార్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -