Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం210 మంది ట్రాన్స్‌ జెండర్లకు గుర్తింపు కార్డులు

210 మంది ట్రాన్స్‌ జెండర్లకు గుర్తింపు కార్డులు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 210 మంది ట్రాన్స్‌ జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఆధార్‌ అప్‌డేషన్‌, గుర్తింపు కార్డులు పొందే విషయంలో ట్రాన్స్‌ జెండర్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు హైదరాబాద్‌లోని మలక్‌ పేటలో గల రాష్ట్ర వికలాంగులు, సీనియర్‌ సిటీజన్స్‌, ట్రాన్స్‌ జెండర్ల శాఖ సంచాలకుల కార్యాలయంలో మంగళవారం రాష్ట్రస్థాయి ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి కీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌, వాసవి కిన్నెర్‌ వెల్ఫేర్‌ సొసైటీ, అల యెన్స్‌ ఇండియా, వికల్ప్‌ (ప్రజ్వల) సహకారం అందిం చాయి. శిబిరంలో గుర్తింపు కార్డులతో పాటు ఆధార్‌ అప్‌ డేషన్‌, కొత్తగా నమోదు సేవలను అందించారు. కార్య క్రమంలో ఆ శాఖ సంచాలకురాలు బి.శైలజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad