- Advertisement -
హైదరాబాద్ : ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ తన సంపన్న కస్టమర్ల కోసం అత్యంత విలాసవంతమైన ‘గజ్’ క్రెడిట్ కార్డును పరిచయం చేసినట్లు తెలిపింది. దీనిని ఎంపిక చేసిన వారికి మాత్రమే అందించనున్నట్టు పేర్కొంది. ఈ కార్డుకు వార్షిక రుసుమును రూ.12,500గా నిర్ణయించింది. ఏడాదికి రూ.10 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము మాఫీ అవుతుందని పేర్కొంది. ఈ కార్డుతో 12,500 రివార్డ్ పాయింట్లు వెల్‌కమ్ బెనిఫిట్‌గా లభిస్తాయని తెలిపింది. విదేశీ లావాదేవీలపై సున్నా శాతం ఫారిన్ ఎక్సేంజీ చార్జీలను విధించనున్నట్టు తెలిపింది.
- Advertisement -



