Friday, January 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై విచారణ కమిటీ వేస్తే నిజాలు బయటికి వస్తాయి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై విచారణ కమిటీ వేస్తే నిజాలు బయటికి వస్తాయి

- Advertisement -

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు 

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై విచారణ చేపడితే నిజాలు బయటకు వస్తాయని భువనగిరి ఎంపీ చమల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. నవతెలంగాణతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కాలేశ్వరం మాదిరే పాలమూరు ప్రాజెక్టుల విషయంలో విచారణ కమిషన్ వేయాలని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుని కమిషన్ల కోసమే తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జూరాల నుండి ఎందుకు మార్చారో కెటి రామారావు సమాధానం చెప్పాలన్నారు. సుప్రీంకోర్టుకు 7టీ ఎంసీలు తాగునీటి అవసరాల కంటూ చెప్పారు. మిషన్ కాకతీయ కాలేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ పాలనలో నచ్చిన వ్యక్తులకు దోచి పెట్టేందుకే కోట్ల రూపాయలు ప్రజల కట్టిన పన్నులు దోచుకున్నారని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -