కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే..

కొలెస్ట్రాల్‌ ఎక్కువైతే..– కొంతమందికి అకస్మాత్తుగా కాలి, చీలమండల వాపు వస్తాయి. ఇవి కూడా అధిక కొలెస్ట్రాల్‌ సంకేతాలు కావచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా అనుభవజ్ఞులైన వైద్యుల సలహాతో రక్తపరీక్ష చేయించుకోవాలి.
– చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం ఇలా అన్ని కాలాల్లోనూ రాత్రిపూట పాదాలు రోజూ చల్లగా మారుతుంటే.. అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదు.
– అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిల మొదటి లక్షణం కొద్దిగా నడిచినా లేదా కొంచెం వ్యాయామం చేసినా ఆయాసం రావటం. రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగితే, రాత్రిపూట పాదాలు నిరంతరం చల్లగా ఉంటాయి.
– చాలా మందికి అరికాళ్లలో మంట అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొలెస్ట్రాల్‌ పెరగడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.

Spread the love