కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
సిరిసిలను పదేండ్లలో కేటీఆర్ అభివృద్ధి చేసినట్టయితే ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేస్తారు.. కానీ కేటీఆర్ ఎలాంటి అభివృద్ధీ చేయకపోవడంతోనే మూడ్రోజులుగా ఇక్కడే ఉంటున్నారని, ఓటమి భయం అతనికి పట్టుకుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రాజన్న సిరిసిల్లలోని పలు వార్డుల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ మహిళలకు రిజర్వేషన్ పెరగాలని అన్నారని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో సగం మహిళలకు రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇచ్చాం. సన్న బియ్యం ఇచ్చాం. మహిళలకు ఫ్రీ బస్సు కల్పించాం..’ అని చెప్పారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేశారని గుర్తు చేశారు. రైతు అంటే అన్నం పెట్టేవాడని, అందుకే కాంగ్రెస్ రాగానే మద్దతు ధరతోపాటు బోనస్ ఇచ్చి సన్న ధాన్యం కొనుగోలు చేస్తోందని చెప్పారు.
అభివృద్ధి చేస్తే మూడ్రోజులుగా కేటీఆర్ ఇక్కడెందుకు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



