Monday, December 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ గా గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తా 

సర్పంచ్ గా గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తా 

- Advertisement -

మునుకుంట్ల సీపీఐ(ఎం) అభ్యర్థి ఊట్కూరి శ్రీనివాస్ 
నవతెలంగాణ – కట్టంగూర్
తనను గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే ప్రజలందరికీ సేవకుడిలా పనిచేస్తానని మండలంలోని మనుకుంట్ల గ్రామ సీపీఐ(ఎం) అభ్యర్థి ఊట్కూరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గ్రామంలో కార్యకర్తలు తో కలిసి ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనని గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, గ్రామపంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుందని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరి గోడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీటన్నింటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు అక్కలాయిగూడెం గ్రామానికి కురుమర్తి రోడ్డు నుండి బీటీ రోడ్డు వేసేందుకు పై అధికారులపై ఒత్తిడికి చేసి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పన్నాల సర్వయ్య,పన్నాల వెంకన్న, కన్నెబోయిన జనార్ధన్, పన్నాల పాపులు,ఊట్కూరు సుజాత, చింత ఎల్లయ్య, అల్లి రామలింగయ్య, జాల రమేష్, పన్నాల శ్రీను, బెల్లి శ్రీను, పన్నాల కృష్ణమూర్తి, శ్రీకాంత్, ప్రణయ్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -