మరమ్మత్తులకు నోచుకోని రోడ్డు
నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని పలు గ్రామాల్లో మధ్య ఉన్న అంతర్గత రహదారులు అద్వానంగా తయారయ్యాయి. ఏళ్ళు గా మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలు కష్టంగా మారింది. అసలే వర్షాకాలం చినుకు పడితే రోడ్లన్నీ బురదమయంగా మారి రాకపోకలు నరకప్రాయంగా ఏర్పడి అద్వానంగా తయారవుతున్నాయి. దీంతో వాహనదారులు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులు సైతం దెబ్బతిని గోతులుగా మారిన పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. దీనికి తోడు ఎత్తు పల్లలుగా మారిన రోడ్లలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు గురి అయ్యే పరిస్థితి ఏర్పడింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం పంభాపూర్ గ్రామం బ్రిడ్జి దాటిన తర్వాత పాత పంబాపూర్ వెళ్లే రోడ్డు బురదమయంగా మారి గుంతల మయం అయింది.
ఈ వర్షాకాలంలో పాత పంబాపూర్ నుండి రైతులు, విద్యార్థులు, కూలీలు మహిళలు నిత్యం కాటాపూర్, తాడ్వాయి మండల కేంద్రానికి నిత్యం ప్రయాణిస్తారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు బురదమయంగా మారి వాహనాలు దిగబడి పోతున్నాయి. బుధవారం ఉదయం టాక్టర్ దిగబడి రాకపోగాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ఆ గ్రామం పూర్తి ఆదివాసి గిరిజనులు నివసించే గ్రామం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పాత పంబపూర్ రోడ్డు మరమ్మతులు చేయాలని పంభాపూర్ గ్రామ ఆదివాసి గిరిజనులు కోరుకుంటున్నారు.
చినుకు పడితే చిత్తడే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES