కాలమేదైనా చాలామందికి పదే పదే ముఖం కడుక్కోవడం అలవాటు. ఈ క్రమంలోనే కొంతమంది ‘డబుల్ క్లెన్సింగ్’ పద్ధతిని పాటిస్తుంటారు. అంటే.. ఒకే సమయంలో రెండుసార్లు ముఖం శుభ్రం చేసుకోవడమన్నమాట! ఇందులో భాగంగా తొలుత చర్మంపై ఉన్న జిడ్డును తొలగించుకోవడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్‌తో ముఖం కడుక్కోవడం, ఆపై నీటి ఆధారిత క్లెన్సర్‌తో చర్మంపై ఉండే చెమట, ఇతర మలినాల్ని తొలగించడం. నిజానికి దీనివల్ల చర్మం మరింతగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మేకప్ ఉపయోగించకుండా, మొటిమలు-జిడ్డుదనం.. వంటి సమస్యలేవీ లేనివారు ఈ తరహా పద్ధతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు. ఇక మిగతా వారు కూడా తమ చర్మతత్వాన్ని బట్టి సరైన ఫేస్‌వాష్‌ని ఎంచుకొని.. నిపుణుల సలహా మేరకు నిర్ణీత వ్యవధుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
‘అతి’ అనర్థమే!
ముఖంపై పేరుకున్న మతకణాల్ని తొలగించుకునే క్రమంలో ‘ఎక్స్‌ఫోలియేషన్’ ప్రక్రియను పాటించడం మనకు తెలిసిందే! అయితే ముఖం మరింత మదువుగా మారాలన్న ఉద్దేశంతో ఈ పద్ధతిని ఎక్కువసార్లు పాటించినా చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రక్రియ మితిమీరితే మతకణాలు తొలగిపోవడం మాటేమో గానీ.. చర్మం మరింతగా పొడిబారిపోతుందట! కాబట్టి వారానికి రెండుసార్లు, అదీ ఇంట్లో తయారుచేసిన స్క్రబ్‌తో రాత్రి పడుకునే ముందు ముఖాన్ని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు.
మితిమీరితే…
- Advertisement -
- Advertisement -



