Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పట్టా పేరుతో భూములు లాక్కుంటే తరిమికొడదాం..

పట్టా పేరుతో భూములు లాక్కుంటే తరిమికొడదాం..

- Advertisement -

లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు 
అజ్మీరా పులిసింగ్ నాయక్..
తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్)జిల్లా అధ్యక్షుడు…పీక కిరణ్
నవతెలంగాణ – మల్హర్ రావు

నిమ్మగూడెం గ్రామానికి సంబంధం లేని ముక్తేదారు  జగన్నాధ రావు నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారి వారి బంధువుల పేర్ల పై గిరిజనులను తెలియకుండా 1956 సంవత్సరంలో 600 ఎకరాల భూమిని పట్టా చేసుకున్న పట్టాలను రద్దు చేయాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారానే భూమిని సాధించుకోవాలని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మేరా పూల్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం నిమ్మగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి మాట్లాడారు. ఈ భూమిలో నిమ్మగూడెం గ్రామానికి చెందిన గిరిజన, హరిజన, బలహీన వర్గాలకు చెందిన రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వారి పట్టాలను రద్దుచేసి మోఖ సర్వే చేసి ఇక్కడ ప్రజలకు పట్టాలు అందించాలన్నారు.

ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కరీంనగర్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్ అయితు బాపు మాట్లాడుతూ ప్రజల ఆర్థిక పరిస్థితులు చూసి కొంతమంది మాజీ నక్సరేట్లు రంగ ప్రవేశం చేసి పట్టాదారులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని  డబ్బులు పంచుతున్నారని,వారి పద్ధతులను మార్చుకోకుంటే ప్రజాక్షేత్రంలో గెలుచుకుంటామని పేర్కొన్నారు.కొంతమంది నిమ్మగూడెం గ్రామానికి చెందిన మధ్యవర్తులను డబ్బు ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆలోచన చేయాలని నీతో పలికారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడుతూ.. కొమరం భీమ్ అంబేద్కర్ వారసులమని నిమ్మగూడెం వాసులు గత భూ పోరాటంలో భూ కబ్జా చేసిన ఆంధ్ర వారిని తరిమికొట్టిన చరిత్ర ఈ గ్రామానికి ఉందని గత చరిత్రను మర్చిపోకుండా భూమినీ మన నుండి లాక్కుని ప్రయత్నం చేస్తున్న వారిని తరిమికొట్టే పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు.

గతంలోనే 28 మంది ఆదివాసులపై పోలీసులు కేసులు పెట్టారని నేడు కూడా నలుగురు పై కేసు పెట్టి బెదిరిస్తున్నారని కేసు పెట్టిన ఆజoనగర్ గ్రామానికి చెందిన వారు కేసును వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రజల నుండి భూమి లాక్కునే ప్రయత్నం చేస్తున్న కుట్ర దారులైన ముత్తారం మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులను సస్పెండ్ చేయాలని మంత్రి  శ్రీధర్ బాబుకు విజ్ఞప్తి చేశారు.మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని 1956 లో అక్రమ పట్టాలను చేసుకున్న వారి పేర్లపై పట్టాలను రద్దు చేయించి, మోఖ సర్వే చేయించి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు రామగిరి రాజు. తెలంగాణ రైతు పోరాట వేదిక అధ్యక్షులు దాసరి రమేష్ తో పాటు గ్రామానికి చెందిన 200 మంది ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad