Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ గా గెలిచాక నా ఆస్తులు పెరిగితే జీపీకే రాసిస్తా: అభ్యర్థి జయపాల్

సర్పంచ్ గా గెలిచాక నా ఆస్తులు పెరిగితే జీపీకే రాసిస్తా: అభ్యర్థి జయపాల్

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువకులకు అవకాశం కల్పించాలని మండల పరిధిలోని గుడితండ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గుగులోతు జయపాల్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ గా గెలిచాక, నా ఆస్తులు పెరిగితే గ్రామపంచాయతీకి రాసిస్తానని బాండ్ పేపర్ పై రాసి సమర్పించారు. గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు సేవకుడినై పనిచేస్తానని, తప్పుడు లెక్కలు చూపించనని అన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -