బీసీబీకి ఐసీసీ అల్టిమేటం
ఢాకా : ఐసీసీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడమని, తమ మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పలుమార్లు కోరినా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. భారత్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్లకు భద్రతాపరమైన సమస్యలు లేవని, ఐసీసీ స్వతంత్ర దర్యాప్తు సంస్థ నివేదికను బీసీబీతో పంచుకున్న ఐసీసీ.. తాజాగా అంశంలో అనిశ్చితి వాతావరణం తొలగించేందుకు బంగ్లాదేశ్‌కు అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది.
గ్రూప్-సిలో ఉన్న బంగ్లాదేశ్ తొలి మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, నాల్గో మ్యాచ్ ముంబయిలో ఆడనుంది. గ్రూప్-బిలో ఐర్లాండ్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో షెడ్యూల్ చేయగా.. ఆ జట్టును గ్రూప్-సికి మార్చాలని బీసీబీ కోరుతోంది. ఐసీసీ ఈ అభ్యర్థనలను తిరస్కరిస్తూ.. ఈ నెల 21 లోగా ఆడేది లేనిది నిర్ణయాన్ని వెల్లడించాలని స్పష్టం చేసింది. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరిస్తే.. ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం ఆ స్థానంలో స్కాట్లాండ్ ఆడుతుందని ఐసీసీ అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.



