నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేరళలో పినరయి విజయన్ (ఎల్డీఎఫ్ ప్రభుత్వం) గెలిస్తే, కేరళ కూడా గెలుస్తుందని నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ అన్నారు. కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, వామపక్ష కూటమికి విజయం చేకూరాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కమల్ హాసన్ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశారు. ”కామ్రేడ్ విజయన్ గెలవాలి, కేరళ కూడా గెలుస్తుంది” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
”రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అన్నింటికంటే మించి, కేరళ నా సొంత గడ్డ, కొంతమంది నన్ను బయటి వ్యక్తిగా భావించినప్పటికీ, నాకు కేరళతో భావోద్వేగ అనుబంధం ఉంది. కాబట్టి కేరళ ప్రజలు గత పదేండ్ల గురించి ఆలోచించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మనం సరైన నిర్ణయం తీసుకుందాం” అని అన్నారు.
పినరయి విజయన్ గెలిస్తే…కేరళ కూడా గెలుస్తుంది
- Advertisement -
- Advertisement -



