Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునాడు ప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తే, నేడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది

నాడు ప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తే, నేడు అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది

- Advertisement -

– సీపీఐ(ఎం) కేంద్ర నాయకులు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : నాడు ప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తే నేడు ప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని సీపీఐ(ఎం) కేంద్ర నాయకులు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఎమర్జెన్సీ నాడు- నేడు అనే అంశం పైన జిల్లా సదస్సును జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ(ఎం) కేంద్ర నాయకులు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ హాజరై మాట్లాడుతూ.. 1975లో 25న ఎమర్జెన్సీని నాటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ప్రకటించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని ప్రతిపక్షాల నాయకులను, విద్యార్థి నాయకులను, కార్మిక నాయకులను ప్రధానంగా సీపీఐ(ఎం) పార్టీ కార్యకర్తలు అందరిని మీసా చట్టం కింద అరెస్టు చేసి జైలు పాలు చేశారని 18 నెలల పాటు తీవ్ర నిర్బంధం కొనసాగిందని ప్రజాస్వామ్య హక్కులు పూర్తిగా హరించబడ్డాయని ఆయన అన్నారు. నేడు బిజెపి అధికారంలోకి వచ్చిన దశాబ్ద కాలం పైగా ప్రశ్నించే వారిని, నరేంద్ర మోడీని విమర్శించిన వారిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేసి ఆరు నెలలకు పైగా బెయిల్ రాకుండా నిర్బంధంస్తున్నారని. విమర్శించిన వారిని జాతి ద్రోహులుగా ,దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా హరిస్తూ, నియంతృత్వ విధానాలతో ముందుకు పోతున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం తమ చట్టాలను కాపాడుకోవడం కోసం, పేదరికాన్ని తగ్గించాలని, నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని దేశంలోని మిగతా అన్ని వర్గాలు ఈ సమ్మెకు ఈ భా గంగా పోరాటాల్లోకి వస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి ప్రజలందరూ సమైక్యంగా కదిలినప్పుడే నియంతృత్వ విధానాలను నిలువరించగలుగుతామని కొరకు నాటినుండి నేటి వరకు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన సిపిఎం పార్టీ కార్యకర్తలే నిర్బంధాలను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించిన నాడు ఇందిరా నే ఇండియా, ఇండియా నే ఇందిరా అన్న నానుడిని ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి జనతా పార్టీని అధికారంలోకి తెచ్చారని. నేడు యుగపురుషుడిగా విశ్వ మానవుడిగా చెప్పుకుంటూ మోడీ జపం చేస్తూ ఉన్నవారికి గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, వేషాల గంగాధర్ నగర కమిటీ సభ్యులు అనసూయ, కటారి రాములు, అనిత నరసయ్య, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి సిర్ప లింగం, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad