Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూనిర్వాసితులు అభ్యంతరాలు ఉంటే చెప్పండి 

భూనిర్వాసితులు అభ్యంతరాలు ఉంటే చెప్పండి 

- Advertisement -

– హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఉమ్మడి మండలంలోని తోటపల్లి, చౌటపల్లి, జనగామ గ్రామాలలో ఏర్పాటుచేసే ఇండస్ట్రియల్ పార్క్ లో భూములు కోల్పోయే భూనిర్వాసితులు ఏలాంటి అభ్యంతరాలు ఉన్న చెప్పాలని హుస్నాబాద్ ఆర్డిఓ రామ్మూర్తి అన్నారు. సోమవారం హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో నిర్వాసితులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు కోసం మూడు రెవిన్యూ గ్రామాల పరిధిలో భూములను కేటాయించిందని నిర్వాసితులకు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు.

నిర్వాసితులు పట్టాలు ఉండి పేరు నమోదు కాని వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదేవిధంగా ఏమైనా పేర్లు తప్పులుగా నమోదు అయితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. పట్టా పాసుబుక్ ఉండి పేరు నమోదు కాలేదని మా దృష్టికి వచ్చిందని అలాంటివి ఉంటే చెప్పాలని వివరించారు. ప్రభుత్వ భూమి, పట్టా భూముల రైతులు సహకరించాలని తెలిపారు. దీంతో రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన భూములు తీసుకుంటే మాకు అన్యాయం జరుగుతుందని ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు, అక్కన్నపేట తహసిల్దార్ , ఆర్ ఐ లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -