ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుల బెయిల్‌పై విచారణ సందర్భంగా సుప్రీంలో వ్యాఖ్యలు 
న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులోని నిందితులు ఉమర్ ఖాలీద్, గుల్ఫిషా ఫాతిమా, షార్జిల్ ఇమామ్ ప్రభృతుల బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. తన క్లయింట్ షిఫా ఉర్ రెహహాన్‌ను ఉపా కింద ఎలాంటి నేరం చేయకపోయినా నిందితుడిగా చేర్చారని ఆయన తరపు వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. అన్యాయమైన చట్టమేదైనా వుంటే దాన్ని శాంతియుతంగా ఉల్లంఘించేందుకు మనకు నైతికంగా హక్కు వుందని గాంధీ సిద్ధాంతం చెబుతోందని అన్నారు. తన నిందితుడిని ప్రత్యేకంగా ఎంపికచేసి మరీ నిందితుడిగా నమోదు చేశారని అన్నారు. తనపై చేసిన అన్ని ఆరోపణలను అంగీకరించినప్పటికీ ఉపా కింద ఏదీ నిర్ధారణ కాలేదని చెప్పారు. సహ నిందితులు ఇద్దరికి ఇప్పటికే బెయిల్ మంజూరు చేసిన ఆ ప్రాతిపదికనే తన క్లయింట్‌కు కూడా మంజూరు చేయాలని తాను కోరుతున్నానని ఖుర్షీద్ వాదించారు.
దీనిపై తదుపరి విచారణను 6వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
అంతకుముందు సోమవారంవిచారణ ప్రారంభమైన వెంటనే ఉమర్ ఖాలీద్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి 116 కేసులను విచారిస్తే, అందులో 97మంది నిర్దోషులుగా తేలిందన్నారు. దాదాపు 17కేసుల్లో సాక్ష్యాధారాలు తారుమారయ్యాయని కోర్టు గుర్తించిందన్నారు. దానికి ఖలీద్‌కు సంబంధమేంటని బెంచ్ ప్రశ్నించగా, ఖాలీద్‌కు సంబంధం లేదని, కేవలం రికార్డుఅయిన వాస్తవాలు చెబుతున్నానని సిబల్ చెప్పారు. వారి గురించి కన్నీళ్ళు కారుస్తున్నారా అని జస్టిస్ కుమార్ ప్రశ్నించగా, దర్యాప్తు జరిగినతీరు, నాణ్యతను ఎత్తిచూపుతున్నానన్నారు.
చట్టం అన్యాయంగా వుంటే శాంతియుతంగా ఉల్లంఘించవచ్చు
- Advertisement -
- Advertisement -

                                    

